పుస్తక సంబంద ప్రశ్నలు-సమాధానాలు:
1) ఉచిత పుస్తకాలలో ఏ ఏ వర్గాలు కలిగి వున్నాయి?
మొత్తం ఇప్పటివరకు 34 విభాగాలను అందిస్తున్నాము.
1) భక్తి యోగం, 2) కర్మ యోగం, 3)రాజ యోగం, 4)జ్ఞాన యోగం, 5)రామాయణం, 6)మహాభారతం, 7)భగవద్గీత, 8)పురాణములు, 9)భాగవతము, 10)వేదములు, 11)ఉప వేదాలు, 12)వేదాంగాలు, 13)ఉప వేదాంగాలు, 14) ఉపనిషత్తులు, 15)గీతలు, 16) ధర్మము, 17)కథలు, 18)శతకాలు, 19)సూక్తులు, 20)కావ్యాలు, 21)నాటకాలు, 22)కీర్తనలు, 23)గేయాలు, 24)దేవిదేవతలు, 25)గురువులు, 26)భక్తులు, 27)కవులు, 28)జీవిత చరిత్ర, 29)మహిళలు, 30)పిల్లలు, 31)చరిత్ర, 32)విజ్ఞానము, 33)వ్యక్తిత్వ వికాసం, 34)మాస పత్రికలు
2) ఈ పుస్తకాలు అన్నీ కంప్యూటర్ లో చదవగలిగే pdf(software) పుస్తకాలా? లేక పేపర్ తో తయారు చేసిన పుస్తకాలా?
ఇవి అన్నీ కంప్యూటర్ లో చదవగలిగే pdf పుస్తకాలు, వీటిని చదవటానికి కంప్యూటర్,laptop,మొబైల్ గాని అవసరం.
3) ఇప్పటివరకు ఎన్ని గ్రంధాలను online లో కి వచ్చాయి?
మొత్తం 3500+ అందిస్తున్నాము. కొన్నిచోట్ల భాగాలు గా కలిగిన గ్రంధాలను సాధ్యమైనంతవరకు కిలిపి ఒకటిగా అందిస్తున్నాము, అనగా పుస్తకం పేరు-మొదటి భాగం, పుస్తకం పేరు-రెండవ భాగం ఇలావుంటే మొత్తం రెండు భాగాలను కలిపి ఒకే పుస్తకంగా ఇస్తున్నాము, దీనివల్ల మళ్ళి,మళ్ళి మిగతా భాగాల కోసం వెతుక్కోకుండా, డౌన్లోడ్ అవసరంలేని విధంగా, ఒకే చోట కలిగి వుండాలన్నదే మా ధ్యేయం. ఇలా చాలా పుస్తకాలను ఒకే భాగంగా అందించాము.
4) ఎలా చదవాలి, డౌన్లోడ్ చేసుకోగలను.
ఇష్టమైన వర్గంలోగల పుస్తకాన్ని ఎంచుకొన్న తర్వాత, RED/Blue అక్షరాలు కలిగిన లింక్ మీద క్లిక్ చేస్తే మీ బ్రౌజరు లో ఆ లింక్ ఓపెన్ అగును, కొద్దిపాటి సమయంలో పుస్తకం డౌన్లోడ్ అయి, మీరు చదువుకొనే విధంగా తయారు అగును.
5) ఎలా ఇతరులకు share చేయగలం?
Email ఐకాన్ మీద క్లిక్ చేసి, Facebook,Twitter ఐకాన్ మీద క్లిక్ చేసి పంచుకోవచ్చు.
6) ఎలా డౌన్లోడ్(Download) చేసుకోవాలి? Download పరిమితి ఉందా?
ప్రతి పుస్తకం ప్రక్కన ఉన్న బాణం గుర్తు మీద క్లిక్ చేసి దిగుమతి చేసుకోవచ్చు. ఎన్ని సార్లు అయినా, ఏ పుస్తకాన్ని అయినా దిగుమతి చేసుకోవచ్చు.
7) పుస్తకం డౌన్లోడ్(Download) కావటం లేదు, లింక్ సమస్య అని వస్తుంది అప్పుడు ఏమి చేయాలి?
ఈ సేవ నిర్వాహకులకు మెయిల్ చేయగలరు, మెయిల్: support@freegurukul.org
8) పుస్తకాన్ని ఎలా open చేసి చదవాలి
ఏదైనా pdf reader software సహాయంతో చదువుకోగలరు
9) epub,kindle ఫార్మాట్లో ebooks లభిస్తాయా ?
ఇప్పటివరకు మేము PDF format మాత్రమే అందుబాటులోకి తీసుకురాగలిగాం. ప్రస్తుతానికి ఆ format మేము support చేయడం లేదు.
10) Excel sheet లో నాణ్యత అనే పదానికి అర్ధం ఏమిటి ?
పాతకాలపు ఫాంట్, పేజీల నాణ్యత ను బట్టి 1,2,3 గా విభజించాం, అంటే 1 అనగా ప్రధమ రకం నాణ్యత(word format కలిగిన నూతన ప్రింట్), 2 అనగా ద్వితీయ రకం scanned image ప్రింట్, అంటే ఫోటో రూపంలో పేజీ ఉండును, దీనిలో టైపు చేసి సరిచేయలేము, కాని నూతన ప్రింట్ దాదాపు కలిగివున్నది. 3 అనగా తృతీయ రకం పాతకాలపు ఫాంట్ కలిగి వున్న image పుస్తకాలు.
11) ఎవరు ఏ పుస్తకం అందించారో, ఎవరు ఆ పుస్తకానికి మూలమో ఎలా తెలుసుకొనేది ?
మేము ప్రతి పుస్తకం ఆ మహానుభావులను స్మరిస్తూ, వారి చేస్తున్న సేవను తెలుపుతూ, వారి వెబ్ సైట్ అండ్ ఫోటో ని ఆ పుస్తకం లో మొదట్లో అందిస్తున్నాము, వారి సేవను మేము మరువలేము. కనుక మీరు ప్రతి పుస్తకం లో మీరు ఆ పుస్తకం యొక్క మూలం ఎవరో తెలుసుకోగలరు.
12) ఎవరెవరు సహాయం అందిస్తున్నారు? వారికీ ఏమైనా ధనం చెల్లించాల్సి ఉందా ?
ప్రస్తుతం కొందరు మిత్రులము WhatsApp గ్రూప్ నందు ఒకరికి ఒకరం సహకరించుకొంటూ, అది ధనమైన, ఇంకొకటి ఏదైనా గాని ఒక సర్వర్ ద్వారా హోస్ట్ చేసి అందిస్తున్నాము. వెబ్సైటు, ఆప్,సర్వర్ ఖర్చులు మిత్ర బృందం అందిస్తుంది.కావున ఇది ఉచిత సేవ.
13)ebooks కి మరెక్కడైనా mirror కలిగినవి ఉందా? మరెక్కడైనా స్టోర్ చేస్తున్నారా?
www.freegurukul.org ద్వారా మరింత వేగంగా,నాణ్యతతో కూడి అందించాలని webserver లోనూ , archive.org లోనే ఇప్పటివరపు భద్రపరిచాం.
14) నేను నా దగ్గర వున్న పుస్తకాలను స్కాన్ చేసి ఇవ్వవచ్చా ?
మీకు ఆ పుస్తకాలపై అధికారాలు వుండి వుంటే, అంటే మీరు వ్రాసినవి గాని, కాపీ హక్కులు లేనివి గాని ఇవ్వవచ్చు.అనధికారమైనవి మేము ప్రచురించలేము!
15) నేను ప్రింట్ తీసుకోవచ్చా ?
మీరు వ్యక్తిగతంగా చదువుకోవడానికి అనుమతి గలదు.
16) నేను అమ్ముకోవచ్చా?
లేదు, కొన్ని పుస్తకాలు ebooks రూపంలో share చేసుకోవటానికి మాత్రమే అనుమతి గలదు, కావాలంటే ebook రూపంలో share చేసుకోవచ్చు.
17) పుస్తకంలో భారత ప్రభుత్వ గుర్తింపు సంఖ్య అని ఒక నెంబర్ వుంది అది ఏమిటి ?
ఆ నెంబర్ ఒక్క DLI books కు మాత్రమే గలదు, అంటే ఈ ప్రత్యేకమైన నెంబర్ తీసుకొని DLI లో సులభంగా వెదకగలరు,అందుకోసం ఆ గుర్తింపు సంఖ్య అందిస్తున్నాము.
18) ఇది వ్యాపారమైన వెబ్ సైట్ ?
ఇది పూర్తిగా ఉచిత, లాభార్జన దృష్టిలేని స్వచ్చంద సంస్థ. ఈ సైటులో ఎటువంటి ads గాని,రిజిస్ట్రేషన్ గాని, ధనం గాని చెల్లించనక్కరలేదు.
19) కాలేజీ లకు, స్కూల్ లకు, గురుకులాలకు, లైబ్రరీ లకు, పీఠాలకు ఉచితంగా ఒకేసారి అందిస్తారా ?
అవును, మాకున్న శక్తి కొలది, ఈ గ్రంధాలను PEN DRIVE ద్వారా కాపీ చేసుకొనే ఉచిత సేవ చేస్తున్నాము. పోస్టల్ అడ్రస్ మా మెయిల్ కి పంపితే మేము పంపిస్తాము.
20) ఎవరైనా చదుకోదగిన పుస్తకాలా ?
అవును,అందరికి, అన్ని వయస్సుల వారికి తగిన, ఆశ్రమ ధర్మాలకు తగిన పుస్తకాలు అందుబాటులో గలవు.
21) ఇంగ్లీష్ లో సమాచారం కలిగిన పుస్తకాలు కుడా అందుబాటులో ఉన్నాయా ?
ఇది పూర్తిగా తెలుగులో గల ebooks మాత్రమే లభ్యం అయ్యేలా చేస్తున్నాము..
22) సినిమా, పొలిటికల్,నావెల్స్, స్కూల్, కాలేజీ సంబంద పుస్తకాలు లాంటివి కుడా అందిస్తారా?
లేదు, ఇది పూర్తిగా భక్తి,జ్ఞాన,ధర్మ సంబంద పుస్తకాలకే పరిమితం.
23) ఇది పూర్తిగా హిందూ,సనాతన ధర్మ, వ్యక్తిత్వ వికాస సంబంద పుస్తకాలు సంబందించినదేనా ?
అవును
24) నా వెబ్ సైట్ లో Free Gurukul Project ని ప్రమోట్ చేయవచ్చా?
ఎటువంటి అశ్లీలం లేని, మతపరమైన ఇబ్బందులు తలెత్తని చోట ఇతరులతో పంచుకోవచ్చు.
25) వచ్చే క్రొత్త పుస్తకాలు, మార్పులు తెలుసుకోవాలంటే ?
మీరు మీ మెయిల్ నుంచి updates కోసం మెయిల్ రిక్వెస్ట్ చేస్తే మేము తెలియచేయగలము. అలాగే updates అనే లింక్ లో కుడా తెలియచేయగలము
26) ఎటువంటి సమాచారాన్ని సేకరించారు ?
భారత ప్రభుత్వపు DLI వెబ్సైటు లో గల గ్రంధాలు పూర్తిగా కాపీరైట్ ఫ్రీ పుస్తకాలు, ఆ గ్రంధాలనే మేము తీసుకొని, వివిధ వర్గాలుగా విభజిస్తూ, pdf format లో అందిస్తున్నాము, అలాగే ఇతర ధర్మ ప్రచార సంస్థలు వారు వారి వెబ్సైటు లో పంచుకొన్న గ్రంధాలను సేకరించి ఒకేచోట అమర్చాము. కావున కాపీరైటు అభ్యంతరాలు లేనివి అనుకొన్న పుస్తకాలను గ్రహించటం జరిగినది. అనుకోకుండా ఏవైనా అభ్యంతరకరమైనవి ఉన్నచో మాకు తెలుప మనవి. వెంటనే వాటిని తొలగించగలము.అలాగే ప్రతి పుస్తకంలో మూల సేకరణ గురించి, ఆ మహానుభావులను స్మరించటం జరిగింది.
27) ప్రతి పుస్తకం పేరుకు ముందు BY,KY,RA,BG,VY.. లాంటి పేరు ఉంది ఏమిటి?
మేము పుస్తకాలను సులభంగా గుర్తించేందుకు, వెతుకుటకు అనువుగా ప్రతి కేటగిరీ/వర్గం కు సంబంద కోడ్ కలుపుతూ పుస్తక పేరు డిజైన్ చేసినాము. అనగా కోడ్+000 to 999-పుస్తక పేరు.pdf. అనగా భక్తి యోగం(BhaktiYogam) కేటగిరీ లో ఒక పుస్తకం "భక్తి తత్వ దర్శనం" ఉన్నది, దానిని ఇలా వ్రాసాము: BY002-BhakthiTatvaDarshanamu.pdf. దీనివలన ఎవరైనా సులభంగా ఇంటర్నెట్ లో వెతుకుటకు అవకాశం గలదు.
వీడియో సంబంద ప్రశ్నలు-సమాధానాలు:
1) వీడియో లు ఎక్కడనుంచి సమాచారాన్ని సేకరించారు ?
youtube
2) వీడియో లు ఎలా Download చేసుకోగలం ?
Youtube వీడియోలు కావున, Download సదుపాయం లేదు.
3)వచ్చే క్రొత్త వీడియోల వివరాలు తెలుసుకోవాలంటే ?
Newly Added సెక్షన్ మీద క్లిక్ చేసి చూడగలరు
4) ఇంగ్లీష్ లో సమాచారం కలిగిన వీడియో లు కుడా అందుబాటులో ఉన్నాయా ?
తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైతే ఇంగ్లీష్ లో కూడా అందిస్తాము
5) నాకు నచ్చిన Youtube లింక్ ఇవ్వవచ్చా ?
మీరు ఇచ్చే లింక్ అందుబాటులో లో వర్గం కు సంబందించినది అయితే "SUBMIT" లింక్ ద్వారా పంపించండి
ఆడియో సంబంద ప్రశ్నలు-సమాధానాలు:
1) ఆడియోలు ఎక్కడనుంచి సమాచారాన్ని సేకరించారు ?
youtube
2) ఆడియోలు ఎలా Download చేసుకోగలం ?
Youtube వీడియోల నుంచి ఆడియో సేకరించి ఇస్తున్నాము కావున, Download సదుపాయం లేదు.
3) వచ్చే క్రొత్త ఆడియోల వివరాలు తెలుసుకోవాలంటే ?
Newly Added సెక్షన్ మీద క్లిక్ చేసి చూడగలరు
4) ఇంగ్లీష్ లో సమాచారం కలిగిన ఆడియో లు కుడా అందుబాటులో ఉన్నాయా ?
తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైతే ఇంగ్లీష్ లో కూడా అందిస్తాము
5) నాకు నచ్చిన Youtube లింక్ ఇవ్వవచ్చా ?
మీరు ఇచ్చే లింక్ అందుబాటులో లో వర్గం కు సంబందించినది అయితే "SUBMIT" లింక్ ద్వారా పంపించండి
Image సంబంద ప్రశ్నలు-సమాధానాలు:
1) Image లు ఎక్కడనుంచి సేకరించారు ?
Google.com and Pinterest.com and websites..
2) Image ఎలా Download చేసుకోగలం ?
Image మీద క్లిక్ చేసి గాని లేక డౌన్లోడ్ ఐకాన్ మీద క్లిక్ చేసి పొందవచ్చు
3) వచ్చే క్రొత్త Image వివరాలు తెలుసుకోవాలంటే ?
Newly Added సెక్షన్ మీద క్లిక్ చేసి చూడగలరు
4) ఇంగ్లీష్ లో సమాచారం కలిగిన Image లు కుడా అందుబాటులో ఉన్నాయా ?
తెలుగు భాషకు ప్రాధాన్యత ఇస్తూ, అవసరమైతే ఇంగ్లీష్ లో కూడా అందిస్తాము
5) నాకు నచ్చిన Image లింక్ ఇవ్వవచ్చా ?
మీరు ఇచ్చే లింక్ అందుబాటులో లో వర్గం కు సంబందించినది అయితే "SUBMIT" లింక్ ద్వారా పంపించండి